తెలంగాణ వీరులను తెలంగాణ తల్లి ఎలా పెంచింది ?
Answers
Answer:
తెలంగాణ తల్లి అనగా తెలంగాణ అమ్మ. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రాంతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఈ తెలంగాణ తల్లి భావన మలిదశ ఉద్యమ వ్యాప్తిలో ఎంతో దోహదపడింది.
తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా, దాన్ని ఉద్యమ ప్రతీకగా ముందుకు తేవాలన్న ఆలోచన మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసారథి కేసీఆర్‌దే. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, తత్వవేత్త బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. బి. ఎస్. రాములు ఆలోచనలు, సూచనల ప్రకారం.. కంప్యూటర్‌పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్. చారి. సాధారణ స్త్రీ మాదిరిగా(తలపై కీరీటం ఆభరణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రించారు. ఈ రూపం దేవులపల్లి అజయ్ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్ పేజీపై ప్రచురితమైంది.
తెలంగాణ తల్లికి తామిచ్చిన రూపాన్ని బీఎస్ రాములు ఉద్యమ సారథి కేసీఆర్ ముందు పెట్టగా.. ఆయన కొన్ని మార్పులు సూచించారు. ఈ విషయమై చర్చించడానికి తెలంగాణ భవన్‌లో రెండు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఎస్ రాములు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ గంగాధర్, గన్‌పార్క్‌లోని 1969 తెలంగాణ అమరవీరుల స్థూపం సృష్టికర్త ఎక్కా యాదగిరి రావు, తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు దుర్గం రవీందర్, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, ఈ తరం చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ మహిళలు, రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్లొన్నారు.
ఈ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేద స్త్రీ రూపంలో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎప్పటికీ ఇలాగే వెనుకబడి ఉండదు కదా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా, దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా మారుతుంది. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితో భారత మాత చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రాన్ని తలపించేలా తెలంగాణ తల్లికి రూపమివ్వాలి అని కేసీఆర్ సూచించారు. కెసిఆర్ సూచనతోపాటు సమావేశాల్లో పాల్గొన్న మరికొందరు ఇచ్చిన సూచనలకు తగినట్లుగా ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పటి తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చారు. తెలంగాణ లోని నాటి పది జిల్లాలకు చెందిన ప్రత్యేకతలను తెలంగాణతల్లి రూపకల్పనలో జోడిస్తూ తీర్మానించడం, జరిగింది .వాటిని సమన్వయిస్తూ బి ఎస్ రాములు డిజైనింగ్ రూపాన్ని సూచించారు. అలా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ,గద్వాల, పోచంపల్లి
Explanation: