'నిజమైన భక్తుడు పంధనాన్ని ఆశించడు- బండారి
బసవన్న' పాఠం ఆధారంగా రాయండి.
Answers
Answer:
ఒక పర్యాయం నారదుడు ‘ఓం నమోనారాయణాయ' అని నారా యణ నామజపం చేసుకుంటూ తన వాయిద్యమైన మహతి మీటు తూ, పాటలు పాడుతూ వైకుంఠంలో ప్రవేశించాడు. తన గాన మాధు ర్యా నికీ,తన భక్తికీ, నారాయణమూర్తి పరవసించి, ఆనందించి మెచ్చు కో వాలని , తనంత గొప్ప భక్తుడు మరెవ్వరూ లేరనీ కాస్తంత గర్వం మనస్సులో ప్రవేసించగా నారాయణుని దర్శించుకున్నాడు.
భగవంతుని స్థానం భక్తుల హృదయమే కనుక నారదుని మనస్సు లో ప్రవేసించిన ఆ రాకాసి ఐన గర్వాన్ని రూపుమాప తలంచి శ్రీమ న్నా రాయణుడు “ నారదా! నీ అంత భక్తుడు ఎక్కడా లేనేలేడు.నీవు నా కోసం ఒకపని చేసిపెట్టాలి. భూలోకములో అందరికంటే గొప్ప భక్తు డెవరో తెలుసుకొని వచ్చి ,నాకు చెప్పు,నీవు గొప భక్తునివి గనుక నిజమైన భక్తుని నీవే బాగా తెలుసుకోగలవు.” అని కోరాడు.
నారదుడు నారాయణుని ఆన శిరసావహించి భూలోకానికి బయలు దేరే ముందు ''స్వామీ! భూలోకంలో ఎలాంటి వానిని నేను భక్తునిగా ఎన్ను కోవాలి? రాజునా, సేవకునా,మునినా,సన్యాసినా,పేదవానినా?" అని అడిగాడు.
శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు –' నారదా! ఎవరైతే పరిశుద్ధమైన హృదయం తో దైవనామాన్ని నిరంతరం స్మరిస్తూంటాడో అతనే నిజ మైన భక్తుడు. లోకసంబంధమైన వ్యవహారాలు ఎన్ని ఉన్నప్పటికీ లక్ష్యమును దైవంపై నిల్పుకోవాలి. మనస్సులో భగవంతుని రూపా న్నే ఉంచుకోవాలి. భగవన్నామాన్ని మరువరాదు.."అని వివరణ నిచ్చాడు.
అప్పుడు నారదుడు ''స్వామీ! నేను నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూనే ఉన్నాను కదా! మరి భూలోకంలో నాకంటే గొప్ప భక్తు డుంటాడా?దీనికోసం భూలోకం వెళ్లాలా? అని అడిగాడు.
నారదునిలో గర్వపు సోదరి అహంకారం కూడా చేరిపోయింది. 'నేనే అందరి కంటే గొప్ప భక్తుడను,' అని అనుకోవడమే పెద్ద అహంకారం. "నారదా!! భగవన్నామాన్ని జపించినంత మాత్రాన చాలదు. ఇలా నామ జపం చేసే భక్తులు లోకంలో ఇంటింటిలో ఉన్నారు, అడుగ డు క్కూ కనిపిస్తుంటారు. ఇది కాదు నిజమైన భక్తి. హృదయంలో ఆవిర్భవించిన ప్రేమను సర్వత్రా ప్రసరింపజేయాలి. మానవుడు భుజించిన ఆహారము పొట్టలో జీర్ణమై దాని సారం సర్వాంగాలకు రక్తం, ద్వారా సరఫరా ఐనట్లుగా, తాను హృదయములో స్మరించిన భగవన్నామం యొక్క దివ్య ప్రభావము కన్నులలో చేరాలి, చెవులలో చేరాలి, నాలుకపై చేరాలి, చేతులలో చేరాలి, పాదములలో చేరాలి. అన్ని అవయవాల్లో చేరిపోవాలి .
అప్పుడే మానవుడు నిజంగా భగవ న్నామమును స్మరించినవాడౌతాడు. లేకపోతే అదంతా ఒక సాధారణ కార్యం మాత్రమే. జీర్ణమైన ఆహారముయొక్క సారము కన్నులలో చేరి నప్పుడు ఏమౌతుంది? ఎలాంటి ఆహారమో అలాంటి దృష్టి కల్గుతుం ది. అలాగే, హృదయంలో స్మరించిన భగవన్నామం యొక్ కప్రభావం కన్నులలో చేరినప్పుడు దృష్టి పవిత్రమైనదిగా రూపొందుతుంది , నాలుక పై చేరినప్పుడు పవిత్రమైన పలుకులనే పలుకుతాము; చెవు లలో చేరినప్పుడు పవిత్రమైన విషయాలనే వింటాము; పాదములలో చేరి నప్పుడు పవిత్రమైన ప్రదేశాలకే నడుస్తాము; చేతులలో చేరిన ప్పుడు సార్థకమైన పనులనే ఆచరిస్తాము. ఈరీతిగా, తనసర్వాంగము లతోను పుణ్య కర్మల నాచరించేవాడే నిజమైన మానవుడు. అలాంటి పరమ భక్తుడు ఎక్కడున్నాడో చూసి రమ్మ''ని చెప్పాడు.
నారదుడు భూలోకమంతా సంచారం చేశాడు. కాని, అతనికి తనను మించిన భక్తుడు లేడనే అహంకారం పోలేదు. తానే గొప్ప భక్తుడననీ, నిరంతరం భగవన్నామాన్ని ఉచ్చరించే వాడిని కనుక నాకంటే భక్తు డు మరొకడు ఉండడనే గర్వమూ చేరింది. ఆఇద్దరు సోదర రక్కసుల వలన , అపవి త్రమైన మనస్సుతో, 'దృష్టిని బట్టి సృష్టి' అన్నట్లుగా నారదుని కళ్ళకు,మనస్సుకు భక్తులెవ్వరూ కనిపించలేదు.
ఎవర్నిచూసినా మనస్సుకు తనకంటే భక్తులని తోచలేదు. ఇహ లాభం లేదు వైకుంఠానికి తిరిగి వెళదామని అనుకుంటూండగా ,ఒక అరణ్యంలో ఒక చెట్టు క్రింద ఒక వ్యక్తి కన్నులు మూసుకొని నామస్మర ణ చేస్తూ కనిపించాడు.
ఐతే అతని చేతిలో ఒక పదునైన కత్తి కనిపించింది. నారదునికి ఆశ్వర్యంకలిగింది,ఆదేవముని అతని దగ్గరకు వెళ్ళి, ''నాయనా! నీవెవరు?'' అని అడుగుతాడు.
".