India Languages, asked by atreyee9758, 1 year ago

కాకిని పేదరికపు పక్షి అనడ౦లో అర్థమేమిటీ?

Answers

Answered by KomalaLakshmi
3
కాకి జనావాసాల మద్య నివసించే పక్షి.ఎంగిలి మెతుకులు ఏరుకొని తిని ,ఆ ప్రదేశాన్ని సుబ్రం చేస్తుంది.కాకి ఆ రకంగా మనిషి కి ఉపకారమే చేస్తుంది.పితృదేవతలకు తృప్తిని ఇచ్చే విధంగా వాయస పిండాన్ని తింటుంది.దేవతలకు తృప్తిగా బలి కూడు తింటుంది.ఇంత  చేసే కాకి కి ఎవరు గౌరవము ఇవ్వరు.కాకి ని ఇతర పక్షుల లాగ పెంచుకోరు.ప్రేమగా నాలుగు మెతుకులు విదల్చరు.మనం పారేసిన ఎంగిలి మెతుకులు తిని బ్రతుకుతుంది.అందుకే కవి కాకిని ‘పేదరికపు పక్షి ‘అని అన్నాడు.




పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.
Similar questions
Hindi, 7 months ago