*రెండు ఖాళీలలో ఒకే జవాబు రావాలి.,*
1) ........... తింటే ఆరోగ్యంగా ....... తాము.
2)లతా! నా ........ ఎక్కడుందో ........
3) అమ్మ ఆ ....... లోని గవ్వలు ..........
4)ఆ చెట్టు ......... ఈ చెట్టువేరు ......... గా ఉన్నాయి
5)........... ని అడగనిదే నా స్కూటర్ .........ను
6)............ బడిన ఇంట్లో పాటలు ..........తున్నారేంటి
7) ............ ఉల్లిగడ్డలు రోట్లో వేసి ...........
8) ఈ ........ తీసుకెళ్లి .......... దిక్కు ఇంట్లో ఇవ్వు
9)............ గా ఉన్నచోట ఈ వేప ......... వేయండి
10)ఆ ........... గిన్నెలోనే ........ సంకటి తీసుకురా
Answers
Answered by
2
రెండు ఖాళీలలో ఒకే జవాబు రావాలి.
1. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము
2. లతా! నా చెప్పు ఎక్కడుందో చెప్పు
3. అమ్మా ఆ ఏరు లోని గవ్వలు ఏరు
4. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా వున్నాయి
5 .అమ్మని అడగనిదే నా స్కూటర్ అమ్మను
6. పాడు బడిన ఇంట్లో పాటలు పాడుతున్నారు ఏంటి
7. నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు
8. ఈ ఉత్తరం తీసుకు వేళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు
9. పొడి గా వున్న చోట వేప పొడి వేయండి
10. ఆ రాగి గిన్నె లోని రాగిసంకటి తీసుకుకరా
Similar questions