చివరలో *యం* పదాలు కనిపెట్టండి..
1. గెలుపు..
2. భీతి వంటిది..
3. వయసు..
4. దెబ్బ..
5. సూర్యుడు వస్తే..
6. గుర్రం..
7. ప్రేమ..
8. శరీరం..
9. కన్ఫర్మ్ ఓకే ష్యూర్ పక్కా..
10. సిగ్గు..
11. అప్పడం తోడిది..
12. చేతికి వేసుకునేది..
13. తెలుగు హెల్ప్..
14. అదృశ్యం..
15. ఒక సుగంధ ద్రవ్యం..
16. గీతలో పత్రం పుష్పం ఫలం__
17. ఇష్టం..
18. అంతం లాంటిది..
19. నన్నయ తిక్కన ఎర్రన..
20. కోవెల..
21. కాలం..
22. అసెంబ్లీలో స్పీకర్ ఉండే చోటు..
23. చీకట్లో మెరుస్తూ కనబడేది..
24. లివర్..
25. గుండె..
26. రొంప దగ్గు వస్తే తాగేది..
27. ఉప్పు రసాయన నామం..
28. నమ్మిన దైవం ఇచ్చేది..
29. పాట లాంటిది..
30. ఒక రంగు..
Answers
చివరలో *యం* వచ్చే పదాలు :
1. గెలుపు - విజయం
2. భీతి వంటిది - భయం
3. వయసు - ప్రాయం
4. దెబ్బ - గాయం
5. సూర్యుడు వస్తే - ఉదయం
6. గుర్రం - మయం
7. ప్రేమ - ప్రణయం
8. శరీరం - కాయం
9. కన్ఫర్మ్ ఓకే ష్యూర్ పక్కా - ఖాయం
10. సిగ్గు - బిడియం
11. అప్పడం తోడిది - వడియం
12. చేతికి వేసుకునేది - కడియం
13. తెలుగు హెల్ప్ - సహాయం
14. అదృశ్యం - మాయం
15. ఒక సుగంధ ద్రవ్యం - మిరియం
16. గీతలో పత్రం పుష్పం ఫలం - తోయం
17. ఇష్టం - ప్రియం
18. అంతం లాంటిది - ప్రళయం
19. నన్నయ తిక్కన ఎర్రన - కవిత్రయం
20. కోవెల - ఆలయం
21. కాలం - సమయం
22. అసెంబ్లీలో స్పీకర్ ఉండే చోటు - పోడియం
23. చీకట్లో మెరుస్తూ కనబడేది - రేడియం
24. లివర్ - కాలేయం
25. గుండె - హృదయం
26. రొంప దగ్గు వస్తే తాగేది - కషాయం
27. ఉప్పు రసాయన నామం - సోడియం
28. నమ్మిన దైవం ఇచ్చేది - అభయం
29. పాట లాంటిది - గేయం
30. ఒక రంగు - కాషాయం
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469
4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు
brainly.in/question/16442994