1.పాఠం ఆధారంగా కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) కాకి
ఆ) గృహం
ఇ) సంతోషం
ఈ) ముల్లు
Answers
Answer:
అ) కాకి=వాయసం, మౌకలి, ద్వాంక్షయ
ఆ) గృహం=ఇల్ల, సదనం, గీము, నికేతనం
ఇ) సంతోషం=ఆనందం, హర్షం
ఈ) ముల్లు=కంటకం చేపలోనగువాని ఎముక
తెలుగు భాషలో పదములు నాలుగు రకములు అవి:
1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
4. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.