107.
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే.
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 44 Telangana SCERT Class X Telugu
Answers
1.ప్రతి మనిషి వెనుకా ఏంటో కొంత చరిత్ర వుంటుంది.నగరం లో నివసిస్తున్న వాళ్ళు దానికి అతీతులు కారు.బతకలేక నగరాలకు వలస పోతున్న మనిషి వెనుక కన్నీటి చరిత్రలు ఎన్నో వుంటాయి.
2.వారిలో కొందరు బీదవారు,నిరుద్యోగులు,విద్యార్దులు,కూలివారు,వుంటారు,వారు ఎన్నోరకాల సమస్యలతో సతమత మవుతు వుంటారు.
౩.వారందరి గూర్చి తెలుసుకోవాలని పై వాఖ్య సారాంశం.
4.పుస్తకం పైన ఉన్న ముఖ చిత్రo చూసినంత మాత్రాన అందులోని విషయం మొత్తం తెలియదు.అల్లాగే నగరవాసి వేష,భాషలతో అతని చరిత్రను తెలిసికోలేము.
5.అతడు చదివి తెలుసుకోవలసిన పుస్కం లానివాడు అని కవి భావన.
(2)నగరం మహా వ్రుఖం కింద
నగరమంతేనే ఒక పెద్ద మర్రి చెట్టు లాంటిది.చెట్టు మిద ఎక్కడెక్కడి నుండో పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి,చెట్టు వాటి సొంతంకానప్పటికి కలుపుగోలుగా అక్కడ వుంటాయి.ఎదో వంకతో నగరానికి కూడా అను నిత్యం మనుషులు వస్తూ వుంటారు.ఎవరు ఎవరికీ ఏమి కారు.అందరిది ఒంటరి బ్రతుకే.చెట్ల పై వుండే పక్షులలో వున్నా ఐకమత్యం కూడా నగర జీవుల్లో కరువయ్యిందని కవి భావన.
(౩)మహా నగర రోడ్లకి
ఇది నిజమే! మహానగరాలలో నాలుగు రోడ్ల కూడలులు చాలానే వుంటాయి.అన్ని వైపులా నుండి వాహన ప్రవాహం వుంటుంది.ఒకవైపు కాక అన్నివైపుల జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి.లేకపోతె ఎ వాహనమో వచ్చి గుద్దుకునే ప్రామదముంది.కాబట్టి నగరాలలో నాలుగు వైపులా నుండి మరణం సంభవించడానికి సావకాశం ఉందని కవి ఉద్దేశ్యం.
పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిన' నగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది.
ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్' అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతం" అనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు.