118. వర్మ తనజాతి జనులలో ఏవిధమైన మార్పును తిసుకురాగాలిగాడు?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 46 Telangana SCERT Class X Telugu
Answers
తెలంగాణా రాష్ట్రం లో 20 వ శతాబ్దం ప్రారంభంలో నిమ్న జాతుల అభున్నతికి,సమాజ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ.
2.మనుషులంతా సమానమని,ఎవరు ఎక్కువ ,తజ్జువ కాదన్న నిజాన్ని అర్థమయ్యేలా చేయగలిగాడు.
౩.దళితుల పై శ్రద్ద వహిస్తూ,వారు చదువు పై దృష్టి పెట్టేలా చేయగలిగాడు.
హిందువులన్దర్నీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు బహిరంగ సభలను నిర్వహించాడు.
4.దేవదాసి,ముర్లి,వాణి కొన్ని సాంఘిక దురాచారాలను నిర్మూలించ గలిగాడు.
5.మద్యపానాన్ని మానిపించి అనేక కుటుంబాలను కాపాడ గలిగాడు.
పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు.