149. కింది వాక్యాలలో ప్రక్రుతి-విక్రుతులను రాయండి.
1 తురుపుదేస ఎర్రబడింది.
2 సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.ఆసమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
౩ రాజు తలచుకుంటే అన్ని సాధ్యం.రేడు మనసును పసిగట్టడం కష్టం.
2 విడదీసి సంధి పేరు రాయండి.
1 బుద్దిమంతురాలు.
2 అచ్చోట.
౩ దివ్యవుషదం
4 సాహసవంతురాలు.
5 సమైక్యతా.
6 ఎక్కాలము
పదజాలం Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 76 Telangana SCERT Class X Telugu
Answers
ప్రక్రుతి --------------- వికృతి
1.దిశ దెస
2.సముద్రం సంద్రం
౩.రాజు రాయుడు
2. విడదీసి సంధి పేరు ;
అ) బుద్దిమంతురాలు= బుద్దిమంత+ ఆలు (రుగాగమ సంధి)
ఆ)అచ్చోట = ఆ+చోట (త్రికసంది)
ఇ)దివ్యవుషదం = దివ్య+ ఔషధం (వృద్ది సంధి)
ఈ )సాహసవంతురాలు = సాహసవంత +ఆలు (రుగాగమ సంధి)
ఉ )సమైక్యత = సమ +ఐక్యత (వృద్ది సంధి)
ఊ)ఎక్కాలము = ఏ +కాలము (త్రిక సంధి)
ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ "నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18 వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.