182. చరిత్ర లో పేర్లు శాస్వతంగా నిలవడం కోసం ఎట్లాంటి మంచి పనులు చేయాలి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
అందరిలో ఒకరిగా కాక ప్రత్యేకంగా చరిత్రలో నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి.ఏదైనా ఒక రంగానికి జీవితాన్ని అంకితం చేసి ముందుకు నడచేవారు చరిత్ర లో స్తిరస్తాయిగా నిలిచిపోతారు.బిరుదుల వల్ల ,సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదని కవి చెప్పారు.స్వార్ధం విడిచిపెట్టి ఇతరుల మేలుకోసం ఆలోచించాలి.యాంత్రికంగా కాక చిత్త శుద్దితో పని చేయాలి.ఎన్నటికి మరచిపోని త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు చిరస్తాయిగా నిలిచి వుంటుంది.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.