చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 2014 జూన్ 8న హిమాచల్ ప్రదేశ్ లోని మండిజిల్లాలోని బియాస్ నది అందాలు వీక్షించడంలో లీనమైపోయారు 48 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు. ముగ్గురు అధ్యాపకులతో తెలంగాణ రాష్ట్రం నుండి విఙ్ఞానయాత్రకు బయలుదేరిన విద్యార్థులు, ఆనాటి సాయంత్రం సుమారు ఆరుగంటల ముప్పై నిమిషాలవేళ సన్నసన్నగా ప్రవహిస్తున్న బియాస్ నదిలో మధ్య బండరాళ్ళ మీద మోకాలిలోతుదాకా వెళ్ళి, ఆ నది అందాలన్నీ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. పైనున్న రిజర్వాయరు గేట్లు ఎత్తిన సంగతి వీళ్ళకు తెలువదు. పరిసరాల్లో ఉన్న హెచ్చరికలను వీళ్ళు గమనించలేదు. నదిలో హఠాత్తుగా నీటిమట్టం పెరగడం గమనించిన కొందరు ప్రమాదాన్ని శంకించి బయట పడటానికి ప్రయత్నం చేసారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. మరికొందరు ఇతరులను కాపాడటానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో కొందరు విజయం సాధిస్తే, ఒకరిద్దరు ప్రాణాలనే పణంగా అర్పించారు. మొత్తం మీద సగం మంది నిండుప్రాణాలు అందరూ చూస్తూండగానే ఆ నీటి ఉధృతికి బలి అయిపోయాయి. ప్రపంచ మానవాళి హృదయాలను కలచివేసిన సంఘటన ఇది. ఇటువంటి సంఘటనలు తరచూ మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆకతాయితనంతో ఈత రానివాళ్ళును నీళ్ళల్లోకి తోసివేయడం, ఈత రాకున్నా మిత్రులను చూసి ఉత్నాహంతో నీళ్ళలో దూకి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, నీటిలోతును తప్పుగా అంచనా వేసి, ప్రాణాలు పోగొట్టుకోవడం...... తీర్థయాత్రల్లో, పికినిక్ లలో, విహారయాత్రల్లో, ఈతకొలనుల్లో, చెరువుల్లో, దిగుడుబావుల్లో జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యం కోసం, శరీర దారుఢ్యం కోసం జిమ్ లకు వెళ్ళడానికి, కరాటే, కుంగ్ ఫూ లాంటి రక్షణ విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే - 'ఈత నేర్చుకోవడం' అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇది ఆత్మరక్షణకే గాక , నీటి ప్రమాదాల నివారణకూ దోహదపడుతుంది. ప్రశ్నలు: అ) సాధారణంగా నీటి ప్రమాదాలు ఎట్లాంటి సందర్భాల్లో జరుగుతాయి? ఆ) నీళ్ళవద్ద ఆకతాయితనం ప్రదర్శించడం మంచిదేనా?ఎందుకో తెలుపండి. ఇ) ఈత నేర్చుకోవడం వల్ల ఏయే ప్రయోజనాలుంటాయి? ఈ) ప్రయాణాల్లో, విహారాల్లో, నీటి పరిసరాల్లో తిరిగేటప్పుడు, నీటిలోకి దిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేవి?
Answers
2.గ్రామాలలో వాగులు ,వంకలు తెప్పల సహాయంతో దాటుతూ వుంటారు,హటాత్తుగా పెరిగిన నిటి ప్రవాహానికి కొట్టుకుపోయే ప్రమాదం వుంటుంది.
౩.నదులలో ,సముద్రాలలో ,తీరప్రాంతాలలో విహారానికి లాంచిలలో ,బోట్లలో వెళ్ళినపుడు అవి నీటిలో మునిగిపోయే అవకాసలేక్కువ.
4.పుణ్య తిథులలో ,సముద్ర స్నానాలకు,నదీస్నానాలకు ,పుష్కరాలకు వెళ్ళినపుడు అక్కడ లోతుతెలియక మునిగిపోయే ప్రామాదముంది.
ఆ)నీళ్ళలో దిగి స్నానం చేయాలనుకొనే టప్పుడుఆకతాయితనం పనికిరాదు.అక్కడ లోతు ఎంతవుంటుందో మనకి తెలియదు.కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోని ఏ గోలుసునో, కర్రనో ఆధారం చేసుకొని స్నానం చేయాలి. వేగంగా వచ్చే ప్రవాహంలో స్నానం ఇంకా ప్రమాదకరం.దానిలోకి ఒంటరిగా దిగారాదు.స్నానం చేసేటపుడు అల్లరిగా పక్కవారినిలాగడం,మునగడం,నీళ్ళు చల్లడం లాంటి తుంటరి పనులు చేయరాదు. వారికీ ఈత రాకపోతే వారు మునుగే ప్రమాదం వుంది.
ఇ)1.ఈత వల్ల చాల ప్రయోజనాలున్నాయి,ఇది శరీరానికి మంచి వ్యాయామము.
2.దీనిని మించిన వ్యాయామం లేదని డాక్టర్లు చెబుతారు.ఈతకొట్టే పద్దతిలో మొత్తం సరిర భాగాలన్నీకదులుతాయి.గుండెకురక్తసరఫరాబాగాజరుగుతుంది
. ౩.ఈత వస్తే నీటి ప్రమాదాల నుంచి బయట పడచ్చు..మనతోపాటు పక్క వారిని కూడా కాపాడవచ్చు.
ఈ) ప్రయాణాలు చేసేటపుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.లగేజ్ అంతా ఒకచోటే పెట్టాలి.వాటికి జాగ్రత్తగా తాళాలు వేయాలి. అక్కడి విద్యుచ్చక్తి సాధనాలను ఉపయోగించే ముందు వాటిని ముందుగా పరిసీలించాలి. పరిచయం లేని వ్యక్తుల నుండి తినుబండారాలను తీసుకోని తినకూడదు. తెలియని కొత్త ప్రదేశంలో నిల్లలోకి దిగేటపుడు అక్కడి లోతెంతో ముందుగా తెలుసుకోవాలి.ఈత రానివారు వొంటరిగా ఎప్పుడూ నీటిలోకి దిగారాడు. తెలియని నిటి పరిసరాల్లో గైడ్ లేకుండా స్వేచ్చగా తిరగరాదు.అక్కడి రిజర్వాయర్ల నుండి అకస్మాత్తుగా నీటిని దిగువకు వదిలే ప్రమాదముంది. ప్రక్కవారిని,గైడ్లను సంప్రదిస్తూ వారి సూచనలను ,పెద్దల సలహాలను తప్పక పాటించాలి.
Answer:
హలో!
అ) సాధారణంగా నీటి ప్రమాదాలు తీర్థయాత్రలలో, పిక్నిక్ లలో, విహారయాత్రలో, ఈతకొలనులో, చెరువుల్లో, దిగుడుబావుల్లో జరుగుతూ ఉన్నాయి.
ఆ) నీళ్ళ వద్ద ఆకతాయితనం ప్రదర్శించడం ఏమాత్రం మంచిది కాదు. ఈత రాకపోయినా స్నానం చేయాలనుకునేవారు, ముందుగా నీటిలోతు సరిగ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. నీటిలోతు తెలుసుకోకుండా లోపలికి దిగడం ఎంతమాత్రం మంచిది కాదు. అలాగే కర్రల సాయం తీసుకొని స్నానం చేస్తే మరీ మంచిది.
ఇ) వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం అనగానే, ముందుగా గుర్తొచ్చేది ఈత, ఈత కొలను లే. వేసవి వేసవి కాలంలో ఈత వలన ఉపశమనం తో పాటు వ్యాయామం కూడా అందుతుంది. తరచూ ఈత కొట్టే వారిలో మెదడు పనితీరు, జీర్ణశక్తి మెరుగుపడతాయి. కీళ్లు, కండరాలు, నరాలు బలపడతాయి. రక్తపోటు తగ్గుతుంది. ఒత్తిడి తగ్గించి మంచి నిద్రకు దోహదపడుతుంది.
ఈ) ఈత వచ్చిన వారైనా, రానివారైనసరే, తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.
- శరీర నిర్మాణానికి అనువైన స్విమ్మింగ్ సూట్ ను ధరించాలి.
- తల వెంట్రుకలు తడవకుండా మాస్క్ వాడాలి.
- వాతావరణానికి అనుగుణంగా డార్క్, క్లియర్ కళ్ళజోడును వాడాలి.
- చెవిలోకి నీళ్లు వెళ్లకుండా సిలికాన్ ఇయర్ ఫ్లెగ్స్ ను వాడాలి.
- నీటిలో ఎక్కువ సేపు తడవడం వల్ల చర్మ సంబంధ రోగాలు రాకుండా వాసిలిన్ వాటిని వాడాలి.
- ముఖాన్ని పైకి ఉంచి ఈదాలి. ఊపిరి పీల్చుకునే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఇక విహారాల్లో, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- అపరిచితులతో అస్సలు మాట్లాడకూడదు. వారు ఇచ్చిన ఎటువంటి తినుబండారాలను అయినా అస్సలు తీసుకోకూడదు.
- మన లగేజి బ్యాగులు ఎప్పుడూ మొత్తం కలిపి ఒకే చోట పెట్టి వాటికి తాళాలు వేసి ఉంచాలి.
- మన లగేజిని ఎవరో ఒకరు పర్యవేక్షిస్తూ ఉండాలి.
- లగేజీని ఒక చోట పెట్టి మీరు ఇంకో చోట నిర్లక్ష్యంగా ఎక్కడో చూస్తూ ఉండడం అస్సలు తగదు.
- కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒకే చోట ఉండాలి.
- ముఖ్యంగా చిన్నపిల్లలను దగ్గరే ఉంచుకోవాలి లేకపోతే వారు తప్పి పోయే ప్రమాదం ఉంది.