any article in Telugu in own
Answers
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్-370 అక్కడి శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ప్రసాదించే అధికరణం- 35ఏ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రత్యేక హక్కులను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం త్వరలో విచారించనుంది. జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆర్టికల్-35ఏకు అనుకూలంగా మాట్లాడుతుండగా కొందరు వ్యతిరేకిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ 35 ఎ అధికరణాన్ని కదిలిస్తే కశ్మీర్ లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వారే ఉండరని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ మాత్రం బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా అధికారంలోకి వచ్చినప్పుడు 370, 35ఎ అధికరణాల గురించి నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. 370 అధికరణాన్ని రద్దు చేయాలని బీజేపీ తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒకవేళ 35ఎ అధికరణానికి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తే, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ప్రజలను కూడగడతామని నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇది జమ్ముకశ్మీర్ రాష్ట్ర హక్కు అని తేల్చి చెప్పారు. ఇక 35 ఎ అధికరణంపై చర్చకు తెరతీస్తే అది తేనెతుట్టెను కదిపినట్టేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Explanation:
you are a తెలుగు boy I am also a తెలుగు boy