how do we save Rivers in telugu
Answers
నదుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగి దేశంలోని నదులన్నీ తీవ్ర ముప్పు ముంగిట నిలిచాయని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’..
నదుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగి దేశంలోని నదులన్నీ తీవ్ర ముప్పు ముంగిట నిలిచాయని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ సదస్సులో ఆయన మాట్లాడారు. నదులే మనకు జీవనాధారం అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తక్షణమే మేల్కొంటే.. పది, పదిహేనేళ్లలో నదులకు పూర్వ వైభవం వస్తుందని, లేకపోతే.. రానున్న పదేళ్లలో వందేళ్లకు సరిపడా నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఏటా వరదలతో పోటెత్తే గోదావరి నది.. నీళ్లు అడుగంటిపోయి దీన స్థితిలో ఉన్న విషయాన్ని ఆయన ఉదహరించారు. పుష్కరాల సమయంలో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని తరలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.