India Languages, asked by ankup5547, 9 months ago

How to write about a tailor men paragraphs in Telugu?

Answers

Answered by suveda34
3

Answer:

దర్జీ .వేలాది ముస్లిం కుటుంబాలు దర్జీ పనిలో ఉన్నాయి.రెడీమేడ్‌ బట్టలు విరివిగా రావడం యువత దానిమీద మోజుతో ఎక్కువ ఆసక్తి చూపుతూ కొనుగోలు చేయడంతో దర్జీల దగ్గర బట్టలు చేసి కుట్టించుకొనేవారు తక్కువయ్యారు. దీనితో వీరి జీవన భృతికి ఆటంకం ఏర్పడి కుటుంబ పోషణ జరగడం కష్టంగా తయారైంది. రెడీమేడ్‌ వస్త్రాలు తక్కువ ధరకు దొరకడం, తోపుడు బండ్లపైన సైతం టీషర్టులు, జీన్‌‌ప్యాంట్లు విరివిగా దొరుకుతున్నాయి. సంతలో సైతం రెడీమేడ్‌ దుస్తులు విక్రయిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దానికి తోడు కుట్టడానికి అవసరమయ్యే సరంజామా (క్యాన్‌వాస్‌, గుండీలు, హుక్సులు, దారాలు, ఆయిల్‌మిషన్‌) ధరలు పెరగడంతో దర్జీల దగ్గర బట్టలు ఇచ్చి కుట్టించుకొంటే ధర ఎక్కువ అవుతుందని అదే రెడీమేడ్‌ తీసుకొంటే తక్కువ ధరకు దొరుకుతాయి. వాటిమీద ఆదరణ చూపిస్తున్నారు. ఈ వృత్తినే నమ్ముకొని కొందరు ఇతర చోట్లకు వలసలు వెళ్ళారు.గిరాకులు దర్జీల వద్దకు వచ్చి బట్టలు కుటించుకొనే ఓపిక నశించింది. దర్జీల చేతికి ఇస్తే సరైన సమయానికి బట్టలు కుట్టించి ఇవ్వలేరని అప్పటికప్పుడు రెడిమెడ్‌ షాపులలోకి వెళ్ళి తమకు కావాల్సిన దుస్తులను ఎంపిక చేసుకొంటున్నారు. దీని ప్రభావం దర్జీల పై చాలా పడింది. గతంలో మాదిరిగా కాకుండా నేడు మహిళలకు కుట్టుమిషన్లు శిక్షణఇవ్వడంతో మహిళలకు కావాల్సిన దుస్తులను మహిళలే తమ ఇళ్ళవద్ద కుట్టుకొంటు న్నారు. అంగళ్ళు పెట్టుకొని దర్జీ పనిచేస్తున్న వీరికి పీస్‌ వర్క్ మెటీరియల్స్ గిట్టుబాటు కాకపోవడంతో అంగళ్ళు మూసివేసి ఇళ్ళదగ్గర కుట్టుకొంటున్నారు

hope it helps pls mark as brainliest answer

follow me

Similar questions