India Languages, asked by neha65, 1 year ago

information about Haritha Haram in telugu language

Answers

Answered by kvnmurty
349

    హరిత హారం కార్యక్రమం తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ చంద్ర శేఖర్ గారు జులై 3, 2015 న  ప్రారంభిచారు.  ఇప్పుడు తెలంగాణ మొత్తం వైశాల్యం లో 24% మాత్రమే చెట్లు, మొక్కలతో నిండి ఉంది.  కొన్ని ప్రదేశాలలో అయితే (మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు) 15% మాత్రమే ఉన్నాయేమో.  మొక్కలవల్ల కలిగే లాభాలు అందరికీ తెలుసు.  అందుకే తెలంగాణ రాష్ట్రం లో మూడో వంతు అంటే 34% దాకా చెట్ల తో ఆకుపచ్చదనంతో నిండుగా కనిపించాలని హరిత హారాన్ని ఆరంభించారు.  ఈ కార్యం మన దేశ వన రక్షణ విభాగం వారి లక్ష్యం అధిగమించడానికి, ఇంకా మన ప్రాంతం లో (ecological balance) భూగోళ సంతులాన్ని, సకల జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం చేస్తున్నారు.   మనం అందరం ఎంతో మెచ్చదగినది.

 

     ఇందులో భాగంగా ఉన్న అడవులలో చెట్లసంఖ్య పెంచడం, నిర్ల్క్ష్యo చేసిన అడవులని మళ్ళీ జీవించేలా చేయడం.  స్మగ్గ్లర్లు అడవులనుండి కలప దొంగతనంగా కొట్టి పట్టుకుపోకుండా ఆపడం.  అగ్నివల్ల అడవులకు నష్టం కలగకుండా చూడడం.  మన నేల మట్టి తరుగు అవకుండా చెట్లు పట్టుకొని తేమని, భూసారాన్ని నిలుపుతాయి. అదే మనకు కావలసినది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు.

 

   మరి  జనా నివాస ప్రాంతాలలో మనం అందరం బాధ్యులం.  ప్రభుత్వం కూడా ఎన్నో చోట్ల వారం వారం వేలాది మొక్కలు నాటాడానికి ఏర్పాట్లు చేశారు.  దీని కోసం ప్రణాళికలు కూడా సిధ్ధం చేసి అమలు చేస్తున్నారు. రోడ్ల పక్క , చెరువు, కాలువ గట్ల వెంట, ప్రతి విద్యాసంస్థ లోని ఖాళీస్థలంలోను, ప్రభుత్వ కార్యాలలోనూ, నివాసిత కొలనిల లోనూ , పురపాలక సంస్థలలోనూ, పరిశ్రమల ఆవరణాలలోనూ  మొక్కలు నాటుతున్నారు.  జనంనుండి ఎంతో మంచి స్పందన కూడా లభించింది.

 

   దాదాపు 230 కోట్ల మొక్కలు నాటాలని హరితహారం లక్ష్యం.  సగం అడవులలో నూ సగం మనందరి మధ్యలోను.  అందులో నలభై కోట్లు మొక్కలు 2015 సంవత్సరమే నాటాలని అనుకొన్నారు. మనకందరికి తెలుసు. తెలంగాణలో వర్షాలు తక్కువ కొన్ని జిల్లాలలో.  ఈ హరిత హారంతో మంచి వర్షాలు పడతాయని ఆకుపచ్చని లేత పచ్చని రంగులతో చలచల్లని వాతావరణంతో మళ్ళీ నలభై సంవత్సరాలక్రిందటి తెలంగాణ ప్రకృతి అందచందాలను మళ్ళీ ముందరికి తెస్తుందని ఆశిద్దాం.  రాష్ట్రం కళకళ లాడుతుందని అందరం ఆశిద్దాం. 


kvnmurty: please click on thanks box/link above
kvnmurty: select brainliest answer
Answered by anup15416668nnRitik
2

Explanation:

తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లోనే 46 కోట్ల మొక్కలు నాటబడ్డాయి.[1]

Similar questions