inviting my friend to sankranti holidays letter writing in telugu
Answers
మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ :
ప్రియమైన మిత్రురాలు ప్రియకు,
నీ ప్రియమిత్రురాలు దీపికా వ్రాయునది ఏమనగా,
ఇక్కడ అందరు క్షేమంగా ఉన్నాము. నువ్వు, మరియు మీ కుటుంబసభ్యులు కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సంక్రాంతి పండుగ వస్తుంది కదా! ఉత్సాహపడుతూ ఉండు ఉంటావు సెలవులు వస్తున్నాయని. నీవు పట్టణంలో నివసిస్తూ ఉండడం వలన నీవు ఈ సంక్రాంతి పండుగని పూర్తిగా ఆస్వాదించలేకున్నావని ఎప్పుడు బాధపడుతూ ఉంటావు కదా.
ఈ సారి మా ఊరుకు నువ్వు మీ కుటుంబసభ్యులతో తప్పకుండా రావాలి. మా అమ్మానాన్నలు నిన్ను , మీ కుటుంబాన్ని ఆహ్వానించమని, మీరు తప్పకుండ రావాలి అని చెప్పారు. నీకు తెలుసా? సంక్రాంతికి హరిదాసు కీర్తనలు , ఊరంతా ముగ్గులు, ఆకాశాతా గాలిపటాలు, భోగిపళ్లు వేయటం, కోడి పందాలు, ఎన్నో రకాల పోటీలు, పిండి వంటలు, ప్రతి సాయంత్రం ఆటలు పాటలు, నాటకాలు, బొమ్మల కొలువులు, భోగి మంటలు. చెప్తూనే ఉండాలి గాని, అబ్బో, ఎన్ని చెప్పినా తక్కువే అనుకో. ఈ సారి నీకు అన్ని నేను దగ్గర ఉండి ఈ కోలాహలాన్ని చూపిస్తాను.
త్వరగా మరియు తప్పకుండ వస్తావని ఆశిస్తున్నాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
ఇట్లు,
నీ ప్రియమిత్రురాలు,
దీపిక.
Learn more :
1) 1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి
brainly.in/question/16289469
విజయవాడ,
14 అక్టోబర్ 2021 ప్రియమైన మిత్రునికి,
నేను బావున్నా నా నువ్వు కూడా బాగున్నావ్ అని తలుస్తున్నాను. నేను నా సంక్రాంతి సెలవులను మా అమ్మమ్మ గారి ఇంట్లో జరుపుకున్నాం. చాలా సంతోషంగా గడిపాం. నీవు కూడా సెలవులకు ఎక్కడికి వెళ్లావు తెలియజేస్తారని అనుకుంటాను. మీ తల్లిదండ్రులు బావున్నారా కలుస్తున్నాం.