kaloji Narayana Rao poems with bhavam in telugu
Answers
Answer:
రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ[1] (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న" గా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.[2] పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు.[3] ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి గౌరవించింది[4]. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.[5]
కాలోజీ సత్యనారాయణ రావు గారి పద్యాలు మరియు వాటి భావములు:
1) ఈ భాష నీది ఏ విషయము రా
ఏ భాష నీది ఏ వేషం రా
ఈ భాష ఈ వేషము ఎవరికోసం రా
ఆంగ్ల మందున్న మాట అనగానే
ఇంతకు లికె దెందుకురా
తెలుగువాడి వై తెలుగు రాదని చూడు సిగ్గు లేక ఇంకా చావు ఎందుకురా
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావు ఎందుకురా
భావము:
నీ భాష ఏంటి నువ్వు వేసే వేషాలు ఏంటి పదము వినగానే అంతా ఆనందమే ఎందుకు తెలుగువాడి వై అయ్యుండి కూడా తెలుగు మాట్లాడకుండా ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు అని ఈ పద్య భావం.
2) పూల వాసనలు నిండిన పాలరాతి మెడలో ఆయాసము కలిగించేది పాయసము మెక్కి నాను
వాయువు తో పోటీపడి వాహనాలు ఎక్కి నాను
అతిధి వోలె వుండి వుండి అవని విడిచి వెళితే వెళ్ళుతాను
భావము:
మంచి సుగంధాలు వెదజల్లే ఎటువంటి భవంతిలో పాయసాన్ని తిన్నాను వాహనాలు ఎక్కాను అతిధి లాగా ఈ భూమి మీద నివసించే ఈ భూమిని వదిలి వెళ్లిపోతాను.