S
1. శిలాజ ఇంధనాల అతి వినియోగం ప్రకృతిలో జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది
2.
Answers
Answer:
ముఖ్యాంశాలు:
మానవునికి ప్రకృతి ప్రసాదించిన వనరులే సహజ వనరులు. గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే. భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి. పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము. సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం.దీని వలన సహజ వనరుల సక్రమ పంపిణీ జరిగి, ప్రజల జీవన విధానాలలో అభివృద్ధి జరుగుతుంది.
Answer:
శిలాజ ఇంధనాలు.... వీటిని వాడటంవల్ల వెలువడే కాలుష్యంతో పర్యావరణానికీ, మానవ ఆరోగ్యానికీ ముప్పు వాటిల్లుతుంది. నైట్రోజన్ డై ఆక్సయిడ్, కార్బన్ మోనాక్సయిడ్ వెలువడటంతో వాతావరణ కాలుష్యం ఏర్పడి. ఓజోన్‌కు ముప్పు కలుగుతుంది. ఇంధనాల వాడకంతో వెలువడిన వ్యర్థాలు గాలిలో కలవడం, ఆ గాలిని పీల్చడంవల్ల కళ్లమంట, తలనొప్పి, తల తిరుగుడు, దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శిలాజ ఇంధనాలు వల్ల పొంచి ఉన్న ముప్పును నివారించడంలో పౌరులు, ప్రభుత్వాలు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, బాధ్యతగా వ్యహరించాల్సిన అవసరం ఉంది.
విద్యుత్ బల్బులు, కార్లు, ఎయిర్ కండిషన్లు, టెలివిజన్లు , ఓవెన్లు,... ఇలా మానవ అవసరాల్లోకి ప్రవేశించిన వీటన్నింటికీ ఇవన్నీ పనిచేసేందుకు శక్తి కావాలి. శక్తి సూత్రం ప్రతి ఒక్కరూ చదువుకునే ఉంటారు. అదేమిటంటే శక్తిని పుట్టించలేం. శక్తిని నాశనం చేయలేం. కానీ ఒక రూపంలోంచి మరొక రూపంలోకి మాత్రం మార్చగలం. అయితే ఇక్కడ గమనించాల్సింది మరొకటుంది. కొన్ని రూపాల్లో శక్తిని పునరుద్ధరించగలం. సూర్యుడి నుంచి, గాలి నుంచి, నీటి నుంచి తయారయ్యే శక్తి ఇలాంటి విభాగం కిందికి వస్తుంది. చెత్తా చెదారం, చనిపోయిన చెట్లు, విరిగిపోయిన కొమ్మలు, పేడ, పంటల వ్యర్థాలు ఇలాంటి బయోమాస్ నుంచి కూడా శక్తిని తయారు చేయవచ్చు.ఇక ఇంధనాల్లో రెండో విభాగం పునరుద్ధరణకు వీల్లేనివి. అన్ని రకాల శిలాజ ఇంధనాలు బొగ్గు, ఆయిల్, సహజ వాయువు లాంటివి ఇందుకు చక్కటి ఉదాహరణలు. ఇప్పుడు మనం వాడుతున్న ఇంధనాలు 300 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం తయారైనవి. అంటే డైనోసర్లకంటే ముందుకాలం నాటివన్నమాట. నిరంతరం వాడుతూ ఉండటంతో ఇవి క్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి. మనదేశంలో ఆయిల్ నిల్వలు మరో 19 సంవత్సరాలకు సరిపోతాయి.గ్యాస్ మరో 28 ఏళ్లు, బొగ్గు 230 సంవత్సరాలకు సరిపోతుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు.