samajaabhivrudhilo yuvatha patra essay in telugu
Answers
Answer:
అభివృద్ధి చెందిన భారత్‌గా దేశం పురోగమిం చాలంటే యువతలో నైపుణ్య వికాసం తప్పని సరని లీడ్ ఇండియా 2020 వ్యవస్థాపకులు ఎన్. బి. సుదర్శనాచార్య అన్నారు.
లీడ్ ఇండియా భవన్ అమ్మపల్లి (నర్కుడ) గ్రామంలో మూడు రోజుల నుంచి కంప్యూటర్ నేర్చుకున్న విద్యార్థిని, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఇందులో భారత దేశ చరిత్ర ఔన్నత్యం, జీవితలక్ష్యం నైపుణ్యాలు, ఉద్యోగ నైపుణ్యాలు, శారీరక, మానసిక వికాసం, సామాజిక అభివృద్ధి మానవతా విలువలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విలువలను గురించి ఆటపాటలతో శిక్షణ ఇచ్చారు. ఆది వారం కంప్యూటర్ శిక్షణ లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు సుదర్శనాచార్య చేతుల మీదుగా అందజేశారు.
3వ రోజు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి కీ.శే. ఏపీజే అబ్దుల్ కలాం కలలుగన్న అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కోసం యువత కీలక పాత్ర పోషించాలని సూచించార. చదువుకునే విద్యార్థులు, యువతీ యువకులు లక్ష్యం ఏర్పర్చుకొని, దాన్ని సాధించి వ్యక్తిగత అభివృద్ధి చెందాలన్నారు. తద్వారా దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లీడ్ ఇండియా 2020 జాతీయ కార్యదర్శి శ్రీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచ ంలో చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. యువత తప్పకుండా కంప్యూటర్ నేర్చుకోవాలని సూచించారు.