Telugu essays on freedom fighters
Answers
Answer:
అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణం. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు. అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి సందర్భంగా.. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్ముడు కీలక పాత్ర పోషించిన ఘటనలు మీకోసం..
మొదటి ప్రపంచ యుద్ధం:మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా నాటి వైశ్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫర్డ్ గాంధీని ఢిల్లీకి ఆహ్వానించాడు. యుద్ధం గురించి చర్చించి.. ఆర్మీలో ప్రజలను చేర్చడానికి ఒప్పుకోవాలని కోరాడు. బ్రిటిష్ పాలకుల విశ్వాసం చురగొనడం కోసం గాంధీజీ అందుకు అంగీకరించాడు. ‘వ్యక్తిగతంగా ఎవర్నీ చంపను లేదా గాయపర్చను. అది స్నేహితుడైనా, శత్రువైనా సరే’ అని వైశ్రాయ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు.
చంపారన్ సత్యాగ్రహం:
బిహార్‌లోని చంపారన్ ప్రాంత రైతులు నీలి మందును మాత్రమే పండించాలని బ్రిటిష్ పాలకులు ఒత్తిడి తెచ్చారు. ఎదురు తిరిగిన వారిని చిత్ర హింసలు పెట్టారు. దీంతో అన్నదాతలకు మద్దతుగా గాంధీజీ పోరాటం ప్రారంభించారు. శాంతి యుతంగా పోరాటం చేసిన గాంధీజీ విజయం సాధించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాల్గొన్న తొలి ఉద్యమం ఉంది.