Telugu Varsham poems
Answers
వర్షం పై భూషణ్ గారు రాసిన కవిత :
ఓ వర్షమా! నీవు లేకుంటే మాకు లేదు హర్షం,
పుడమి తల్లి వేచి చూస్తుంది నీ రాక కోసం.
యజ్ఞాలు యాగాలు చేస్తాం నిన్ను ప్రసన్నం చేసుకోవడం కోసం,
నీ చిటపట చినుకులను చూసి అవుతాం మేమంతా మంత్రముగ్ధులం.
నీ ప్రళయ భీకర హోరు చూసి బేతులుతాం,
అయినా నీ రాకకోసమై వేచి చూస్తూనే ఉంటాం, వేచి చూస్తూనే ఉంటాం!
వర్షం అనే పదం ఉపయోగిస్తూ వేమన పద్యం :
వానరాకడయును బ్రాణంబు పోకడ
కానబడదదెంత ఘనునికైన
కానపడిన మీద కలియెట్లు నడచురా
విశ్వదాభిరామ వినురవేమ!
భావం :
ఉన్నట్టుండి వర్షం పడవచ్చు. లేక వస్తుంది అనుకున్న వర్షం రాకపోవచ్చు. ఎంత గొప్ప వాడికైనను చావు ఎప్పుడొస్తుందో ముందే తెలియదు. ఈ జీవితంలో అలా అన్ని ముందే తెలిసిపోతే ఇంక కలిధర్మం ఈ మాయా ప్రపంచంలో ఎలా నడుస్తుంది?
Learn more :
1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము.
brainly.in/question/16599520
2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?
brainly.in/question/16406317
3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.
brainly.in/question/14672033
4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు, నాలుగు వేదాలు
brainly.in/question/16761078