uses of games in Telugu language
Answers
Answer:
హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉంది.
ఆటలు ఆడడం వల్ల ఉపయోగాలు:-
మానసిక ఎదుగుదల:
ఆటలు ఆడే పిల్లలు అటు చదువులోనే కాక జీవితంలో వచ్చే అన్ని సమస్యలను చాకచక్యంతో ఎదుర్కోగలుగుతారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు, ఏకాగ్రత కూడా పెరుగుతుందట.
సోషల్ స్కిల్స్:
ఆటలు ఆడటం వల్ల ఎక్కువమందిస్నేహితులవుతారు. వారితో కలవడం వల్ల ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది.
టీం వర్క్:
మనకు క్లాస్‌లో ఒక టీం తయారు చేసి ప్రాజెక్ట్ ఇస్తే.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలంటే ఆటలు ఎంతో ఉపయోగపడతాయి. ఒక లీడర్‌గా ఎదగగలుగుతాం.
మెదడు చురుగ్గా ఉంటుంది:
ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. చురుగ్గా ఉండే ఆరోగ్యకరమైన మెదడు వల్ల క్లాస్‌లో చెప్పిన వాటిని వెంటనే నేర్చుకుంటాం. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
శారీరక ఎదుగుదల:
ఆటల్లో చురుగ్గా ఉండటం వల్ల నీరసం రాదు. ఒక క్రమ పద్ధతి అలవడుతుంది. శరీరంలో ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా తయారవుతాయి. స్పోర్ట్స్ లో చురుగ్గా పాల్గొనడం వల్ల పిల్లల కండరాల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.
ఆరోగ్యంగా:
ఇప్పుడు మనలో చాలా మందికి తిన్నది అరగటానికి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రెగ్యులర్‌గా ఆటలు ఆడటం వల్ల రక్తప్రసరణ, జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. ఆక్సిజన్ అందుతుంది.
కాంపిటీటివ్ స్పిరిట్:
ఇప్పుడంతా పోటితత్వం పెరిగిపోయింది. అందుకే రిలాక్స్‌డ్‌గా ఉండటానికి, అందివచ్చే అవకాశాలను అందుకోవడానికి ఆటలు ఎంతో తోడ్పడతాయి. కాంపిటీటివ్ స్పిరిట్ పెరుగుతుంది.
స్పోర్టివ్ వైఖరి:
క్లాస్‌లో ఫస్ట్ రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని రోజూ చూస్తున్నాం. కానీ గెలుపోటములు జీవితంలో ఒక భాగం మాత్రమే. వాటిని తట్టుకొని విజయం వైపు పరుగులు తీయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఆటలు ఎంతో ఉపయోగం.
ఇవే కాదు ఇంకా ఆటలు ఆడడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆటలు ఆడటం పిల్లలకు ఎంతో ముఖ్యం.