India Languages, asked by StarTbia, 1 year ago

దున్నేవారికే భూమి అనే కౌలుదారీ చట్టాన్ని ఎవరికి మేలు జరగాలని రూపొందించి ఉంటారు? ఎందుకు?

Answers

Answered by KomalaLakshmi
5
ఇది ఒక ప్రభుత్వ చట్టం.కౌలు రైతులకు మేలు జరగడం కోసం ఈ చట్టాన్ని రూపొందిన్చివుంటారు.సాధారణంగా పల్లెల్లో భూస్వాములు,అంటే భూని ఎక్కువగా వున్నవారు,తమ పొలాలను భూమి లేని చిన్న రైతులకు పండించుకోవడానికి ఇస్తారు.అలా ఇచ్చినందుకు వారి నుండి సంవత్సరానికి కొంత సొమ్మును తీసుకుంటారు.పంటతో సంబంధం లేకుండా ఈ డబ్బులు ఇవ్వవలసి  వుంటుంది. అంతా పొలం యజమాని ఇషాతప్రకారమే జరుగుతుంది.


ఎప్పుడుకావాలంటే అప్పుడు ఆపొలం  యజమాని కౌలుదారు నుండి భూమిని తీసుకొనే హాక్కు వుంటుంది,దీనివల్ల రైతుకు రక్షణ లేకుండా పోతుంది.ఇలా కొన్ని రక్షణలు కల్పించడానికే ఈ చట్టం పూపొందిన్చివుంటారు.


పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Similar questions