India Languages, asked by srushti5925, 1 year ago

కాకిని చులకన చేసి, కోకిలను ఆదరించడం సరైందేనా? ఎందుకు?

Answers

Answered by KomalaLakshmi
0
కాకి,కోకిల రెండు నల్లగా వుండే పక్షులే,కాని కాకి ని చులకన చేసి కాకి గోలని అంటారు.కాని బాగా పాడే వారిని మాత్రం కోకిల తో పోల్చి చెబుతారు.కోకిల ఒక్క వసంత  ఋతువు లోనే కూ ,కూ అని కూస్తుంది.నిత్యం వచ్చి పలకరించే కాకి ని మాత్రం ఆదరించరు.


కాకి మనలను తిట్టదు .కోకిల పిల్చి ధనమివ్వదు .కాని కోకిలను ఇష్టపడ డానికి దాని కమ్మని మధుర స్వరమే కారణం ,కాకిని చులకన చేయడానికి దాని పరుష స్వరమే కారణమని కవి అన్నారు.


పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.
Similar questions