India Languages, asked by nirmalshrestha2202, 1 year ago

అహింసా మార్గాన్ని గాంధిజీ ఎందుకు అనుసరించాడు?

Answers

Answered by VEERA11
0
what is this language.....
Answered by KomalaLakshmi
0
హింసా మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించడం కష్టం.ఎందుకంటే వారివద్ద అంతులేని సైన్యం ,అధునిక తుపాకులు ,ఫిరంగులు ఉన్నాయి.వాటితో వారు దేసభక్తులను,ఉద్యమ నాయకులను చంపేసే ప్రమాదముంది.హింసతో ఎక్కువకాలం ఉద్యమాన్ని నడపలేము.అహింసా పద్దతిలో ఐతే ఇతర దేశాల సానుభూతిని కూడా పొందవచ్చు.నిరంతర ఉద్యమంతో బ్రిటిష్ వారిని లొంగదియవచ్చు.అందుకే గాంధిజీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు.

  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.

ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions