అ)' కోరస్' పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
Answers
.
1.భూమ్యాకాసాలకు సంబంధం వునందని ఎవరైనా అంటే సమాజం నవ్వుతుంది.
2.సమాజం కొత్తదనాన్ని అంత తొందరగా అంగీకరించదు.
౩.పువ్వులకూ,ముల్లకూ మధ్య భేదం చెపితే ,సమాజం కోపడుతుంది.
4.ఆలోచనకు ,ఆచరణకు అర్ధం చెపితే సమాజం అపార్ధం చేసుకుంటుంది.
5.సమాజం యొక్క అసలు రూపాన్ని దానికి తిప్పి చూపిస్తే సమాజం మనకే ఎదురుతిరుగుతుంది.
6.మేధస్సుకూ,మూర్ఖత్వానికి ఉన్న పోలికను చెపితే,సమాజం రాళ్ళు రువ్వుతుంది.
7.ఎవరైనా ఒంటరి వ్యక్తీ సమాజాన్ని విమర్శిస్తే ,సమాజం అతని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది
.
8.తనకి తానె విమర్సించుకొనే వ్యక్తి ఐతే పిరికివాడనే ముద్ర వేస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించిన కవి ఏనాటికైనా సమాజం తన పాటకు కోరస్ అవుతుందని ప్రకటించాడు.సంఘం తనతో గొంతు కలుపుతున్దన్నాడు.
Answer:
సమాజం కొత్త ధోరణులను, వాస్తవాలను అంత తొందరగా అంగీకరించదు. ఆ విషయాన్ని గురించే కవి ఆవేదన | వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలను, సందేహాలను కోరన్' కవితలో లేవనెత్తుతాడు.
భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకున్న సౌకుమార్యాన్ని, ముళ్ళకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి. నీటి ప్రవాహంలోని చైతన్యానికి, నీటి స్తబ్దతకు గల తేడాను అర్ధం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకునే ఆలోచనలకు, ఏమీ చేయలేనితనానికి మధ్యగల స్థితిని తెలుసుకోవాలి. ఇవేమి అంగీకరించకుండా తెలుసుకోకుండా కోపంతో అపార్ధం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి. మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన చేయమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి. ప్రజలకు ఏది ఉపయోగకరమో | గ్రహించలేనివాళ్ళు. ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటున్నాడు కవి.
కవి ఎవరికోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటాడు. తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణచివేయాలని చూసేవాళ్ళకు భయపడనంటాడు. పిరికివాడిగా మూర్ఖుడిగా ముద్రవేసినా లెక్కజేయనంటున్నాడు కవి. నిజానికి తన పోరాటం, వాదన వ్యక్తులమీద కాదని, పనికిరాని వ్యవస్థల మీదనే అని తెలుపుతాడు. భవిష్యత్తులో తనను వ్యతిరేకించినవాళ్ళే వాస్తవాన్ని గ్రహించి తన మాటతో ఏకీభవిస్తారని, తన పాటతో గొంతు కలుపుతారని (కోరన్ అందిస్తారని) ఆశావహదృక్పథాన్ని వెల్లడిస్తాడు. అప్పటివరకు తను ఒంటరిగానే భయం లేకుండా తన భావనలను ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతాడు కవి.