178. కింది అపరిచిత గేయ పాదాలను చదివి జవాబులు రాయండి?
భీతి లేక మనిషి ఎచట శిరము నెట్టి నిలుచునో
తనివి తిర జనుల కెల్లా జ్ఞాన సుధలు దొరకునో
అడ్డుగోడ లేని సమ సమాజమెచట నుండునో
హ్రుదంతరాల జనితముసత్య మెచట వరలునో
ఆ స్వతంత్ర స్వర్గ సీమా నిర్మింపగా తరలి రమ్ము
లెమ్ము,లెమ్ము,లెమ్ము,లెమ్ము,లెమ్ము సోదరా!
1 మనిషి ఎప్పుడు తలెత్తి నిలబడతాడు?
2 జ్ఞాన సుధలు ఎట్లా వుండాలని గేయంలో వుంది?
౩ సమ సమాజం ఎట్లా వుంది?
4సత్యం విలసిల్లడం అంటే ఏమిటి?
5 "వర్గ సీమా "అనడంలో అంతరార్ధం ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
1. భీతి అనగా భయము,లేకపోతె మనిషి తల ఎత్తుకు నిలబడతాడని అర్ధమైంది.
2.ప్రజలందరికి తృప్తి తిరేటట్లు ,జ్ఞాన సుధలు ఉండాలి.
౩.సమ సమాజం ప్రజల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉంటుంది.
4.సత్యం విలసిల్లడం అంటే హృదయంత రాళంలో పుట్టిన సత్య వాక్కు ప్రకాసించడం.
5.సమ సమాజం ,సత్య హృదయం,నిర్భీతి,జ్ఞాన సుధ,కల ప్రదేశము స్వర్గంతో సమానమని దిని అర్ధం.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions