27. ఎ ప్రాంతం వాళ్ళ తెలుగు ఆ ప్రాంతం వాళ్లకి ఇంకా మంచిగా వుంటుంది ,సమర్దించండి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number 12 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
20
భాష అంతా ఒకటే ఐన ,ఎ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతపు యాసలోనే మాట్లాడతారు.ఈ యాస క్రియా రుపాల్లోనే గాక నామవాచకంలో,సంబోదన్నలో,మర్యాదల్లో వైవిధ్య భరితంగా వుంటుంది.
ఒకప్రాంతంలోని మనుషుల జీవన విధానం,వ్యవహార శైలి,పాలకుల విధానం,పరిసర ప్రభావం,తదితరాంశాలు,భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి.ప్రతి పది మైళ్ళకు భాషలో భేదం వుంటుంది.వస్త్ర ధారణా,ఆహార వ్యవహారాలు,వాళ్ళ భాషలో అంతర్లినమై వుంటాయి.భాష పరమార్థం భావ వ్యక్తికరనే కాబట్టి ఎక్కడి వారు అక్కడి భాషకు అలవాటు పడతారు.చెవులకింపుగా ,హృదయాన్ని తాకే టట్టుగా ఉండే భాష వాళ్ళతో విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది.అలవాటు లేని భాష విన్నప్పుడు విచిత్రంగా వుంటుంది.అది రుచించదు.అందుకే ఎవరి భాష వారికి చాల బాగా అనిపిస్తుంది.
అందుకే భాష తల్లి లాంటిదని మాత్రు భాష అని గౌౌర విస్తూ ఆత్మీయ ఆనందాన్ని అనుభావిస్తువుంటాం.
Similar questions