About bamera pothana in telugu essay
Answers
Answered by
6
బమ్మెర పోతనగొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమునుఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు[ఆధారం చూపాలి]. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమునుతెలుగించారు. ఈ భాగవతము మొత్తము తెలుగుదనంఉట్టిపడుతుంది. ఆంధ్రభాగవతమును రచియించిన మహాకవి. ఈయ న ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన. నివాసగ్రామము కడపకు సమీపమున ఉండెడు ఒంటిమిట్టి అనఁబరఁగిన ఏకశిలానగరము.
ఇతఁడు కడుపేదవాఁడు. కృషివలన జీవించువాఁడు. ఇతఁడు బాల్యమున పశువులను మేపుచు తమ ఊరిచేరువను కల కొండమీఁద సంచరించుచు ఉండి తన పురాకృత సుకృతవిశేషము వలన చిదానందుఁడు అను ఒక యోగీశ్వరుని కనుఁగొని ఆమహాత్మునికి నమస్కరించి "స్వామీ మీరెవరో మహాత్ములు అని నాకు తోఁచుచు ఉన్నది. ఇట్టి మహిమ పడయుటకు తగిన ఉపాయమును నాకు ఉపదేశించి నన్ను కడతేర్పుఁడు" అని ప్రార్థించెను. అదివిని ఆయన ఇతఁడు మిక్కిలి బుద్ధిశాలి అని మెచ్చుకొని తారకమంత్రమును ఉపదేశించి పోయెను.
అంతట పోతన గురువు ఉపదేశము చొప్పున నియమముతో తారకమంత్ర జపముచేసి, ఆజపమహిమవలన పరమజ్ఞాన సంపన్నుఁడును మహాకవియును ఆయెను. ఆశ్రమములయందెల్ల గృహస్థాశ్రమము మేలు అయినది అని తలచి, కులశీలవయోరూపముల తనకు తగిన ఒక కన్యకను పరిగ్రహించి, సంతానమును పడసి, లోకోపకారముగా ఒక పురాణమును తెనిఁగింపఁగోరి ఎల్ల పురాణములయందును భాగవతము ఉత్తమము అని విచారించి దానిని తెనిఁగించుచు ఉండఁగా వేమభూపాలుని వద్ద ఆస్థానపండితుఁడును ఇతనికి అనుబంధుఁడును అయిన శ్రీనాథుఁడు ఇతఁడు భాగవతమును తన యేలిన వానికి అంకితముగా చేయింపవలెను అని పల్లకిమీఁద ఎక్కి ఒంటిమిట్ట పొలిమేర చేరరాఁగా అచ్చట దున్నపోతులను కట్టిన అరకను పూని చేను దున్నుచు ఉన్న పోతరాజు కొడుకును ఆచేని గనిమ మీఁద కూర్చుండి భాగవతము వ్రాయుచు ఉన్న పోతరాజును అతనికి కనఁబడిరి.
వారిని చూచి తాను సరస్వతీ ఉపాసకుఁడు కనుక తన మహిమ పోతనకు తెలుపవలెను అని ఎంచి పల్లకి మోచుచు ఉన్న బోయీలను పిలిచి మీరు ఒక ప్రక్క పల్లకి కొమ్మును వదలి రండి అని చెప్పెను. వారు అట్లే చేయఁగా దున్నుచు ఉన్న మల్లన ఒక తట్టుమాత్రము బోయీలు మోపఁగా వచ్చుచు ఉన్న పల్లకిని చూచి "నాయనా ఇదియేమి వింతగా ఉన్నది" అని తండ్రిని అడిగెను. అప్పుడు పోతన "అబ్బీ! నీవును ఒక తట్టు కట్టిన దున్నపోతును విడిచి దున్నుము" అని చెప్ప అతఁడు అట్లుచేసెను. అది చూచి శ్రీనాథుఁడు రెండవ కొమ్మును గూడవదలి పల్లకిని అంతరమున విడువుఁడు అని బోయీలకు ఉత్తరవు చేసెను. అది మల్లన చూచి "నాయనా రెండవతట్టును బోయీలులేక పల్లకి ఉత్తబయల నడచి వచ్చుచు ఉన్నది చూచితివా?" అనెను. "అట్ల అయిన నీవును రెండవదున్నను వదలి దున్నుము" అని చెప్పెను. అతఁడు ఆప్రకారముచేసెను.
అంతట శ్రీనాథుఁడు పోతన ఉన్నచోటికి దాపుగా వచ్చి హాలికులో అని పరిహసించెను. అది విని పోతన "ఉ. బాలరసాలసాల నవపల్లవకోమల కావ్యకన్యకన్, గూళుల కిచ్చి యప్పడుపు కూడుభుజించుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల గౌధ్దాలికులైననేమి నిజదారసుతాదిక పోషణార్థమై."

architha90:
very nice good sister
Answered by
2
బమ్మెర పోతన తెలుగు గడ్డ మీద నడయాడి 500 ఏల్లకు పైనే గడిచిపోయింది.అయినా ఆంధ్రుల చరిత్రలో పోతనది సుస్థిర స్థానం.భక్తి సాహిత్యంలో పోతనది పోత పోసిన ప్రస్థానం.బమ్మెర పోతన పుట్టిన ఊరు ఏది అన్న విషయమై కొన్ని భిన్న వాదాలు ఉన్నప్పటికీ ఆయన ప్రస్తుత తెలంగాణలోనే పుట్టారని చాలామంది అభిప్రాయం.పోతన గురించి తెలిసింది కొంతైనా అటు భక్తులకి ఇటు రచయితలకి మార్గదర్శనంగా నిలిచేoత ఉన్నతమైనది.
పోతన 15వ శతాబ్దంలో వరంగల్లుకు కొద్ది దూరంలో ఉన్న బమ్మెర అనే గ్రామంలో జన్మించారని అంటారు.పోతన ఎలాంటి విద్యాభ్యాసం లేకున్న సరస్వతి కటాక్షంతోనె పద్యాలు రాయగల నేర్పుని సాధించాడు. దీని continuation pic lo undi

Attachments:
Similar questions
English,
1 year ago