కనకంబు meaning in telugu
Answers
Answer:
చిన్నప్పుడు మనం వేమన పద్యాలూ, సుమతి శతకాలు చాలా చదివివుంటాం. ఈ రోజు ఒక పద్యం గుర్తుకు వస్తోంది …..
“అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభి రామ వినుర వేమా!”
ఎంత చక్కని పద్యం. ఇలాంటి పద్యాలూ, శతకాలు ఎన్నో మన భాషలో! జీవితం లోని సారాంశం, ఎన్నో నీతి పాఠాలు ఈ పద్యాలలోనే చెప్పే మహానుభావులెందరో!
నేను ఇక్కడ ముచ్చటించిన పద్యం లాంటిదే నాకు ఇంగ్లీషులో నచ్చిన ఒక వాక్యం …..
“All that is gold does not glitter”
దీని తర్వాత, ఈ వాక్యం చెప్పిన మహానుభావుడు ఇంకొక మాట చెప్పాడు…
“All those who wander are not lost”
ముఖ్యంగా నాలా ఊర్లు పట్టుకు తిరిగే వాళ్ళకు ఊరట కలిగించే వాక్యం.
ఈ పద్యాలూ వాక్యాలు చెప్పే సారాంశం ఒక్కటే – పై పై అలంకరణలు, ఆడంబరాలు చూసి అవే నిజం అనుకోకండి …..జీవితం లో కొందరు వ్యక్తులు, వస్తువులు ఆ ఆడంబరాలు ఏమి లేకుండా వుంటే, వారు పనికి రాని వారని, పనికి రాని వస్తువులని తీసిపారేయ కండి. జీవితం లో చాలా సార్లు, విలువైనవి ఎట్టి తళుకు బెళుకులు లేకుండా వుంటాయి. వాటిని మనం కొంచెం లోతుగా పరిశీలించి అర్ధం చేసుకోవాలి